7 Dead in Plane Crash in Brazil: బ్రెజిల్‌లో విమానం కుప్పకూలింది. చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.
Also Read: IND vs ENG: మేం ఓటములకు భయపడం.. మైదానంలో దిగి సత్తాచాటుతాం: బెన్ స్టోక్స్
సింగిల్-ఇంజిన్ గల ఈ విమానం గాల్లో ఉండగానే ముక్కలై మైనింగ్ పట్టణంలోని ఇటాపెవాలో ఉదయం 10:30 గంటలకు కుప్పకూలినట్లు అగ్నిమాపక సిబ్బంది అక్కడి వార్తా సంస్థకి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మూడు మృతదేహాలను వారు బయటికి తీశారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. విమానం ఓ కొండపై పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.