మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. విభిన్న కథలు ఎంచు కోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక సరికొత్త కథాంశంతో రూపొందిన ‘భ్రమయుగం’ సినిమా ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.‘భ్రమయుగం’ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఓటీటీలో కూడా ఈ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సోనీ లైవ్ లో మార్చి 15 నుంచిఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
దీంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా.. ఈ వీకెండ్ కి ఓటీటీలో ‘భ్రమయుగం’ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ‘భ్రమయుగం’ సినిమాలో కేవలం మూడు, నాలుగు పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలతోనే రెండున్నర గంటల పాటు సినిమా నడిపించడం విశేషం.ఈ మూవీ హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మలయాళంలో ఫిబ్రవరి 15న రిలీజైన ఈ సినిమా తెలుగులో మాత్రం 23న వచ్చింది. మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. బ్లాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్, అమాల్డా లిజ్ మరియు మణికందన్ ఆర్ ఆచారీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.దీంతో ఈసినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించారు.