NTV Telugu Site icon

Brain Eating Amoeba: మరో ముగ్గురికి సోకిన మెదడును తినే అమీబా.. చెరువులో స్నానం చేయడానికి వెళ్లి..

Brain Eating Amoeba

Brain Eating Amoeba

Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా ఒక సలహా జారీ చేసింది.

Paris Olympics 2024: ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వల్ల అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి అమీబా నెగ్లేరియా ఫౌలెరీ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని సాధారణంగా ” అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ ” అంటారు. జంతువులు స్నానాలు చేసే చెరువులలో స్నానం చేయకూడదని, అలాగే ఆ నీటిని వంటలలో ఉపయోగించవద్దని, ముఖం కడుక్కోవద్దని ప్రభుత్వం సూచించింది. అలా చేస్తే క్రిములు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్య అధికారులు తెలిపారు. ఇక ఇదే సమస్య జూలై ప్రారంభంలో తిరువనంతపురంలో 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చనిపోయినట్లు నిర్ధారించబడింది. మే తర్వాత జూలైలో ఇది నాల్గవ వ్యాధి కేసు. వీరంతా పిల్లలే. ఈ వ్యాధి గతంలో 2017, 2023లో కేరళ తీరప్రాంత అలప్పుజా జిల్లాలో కనిపించింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజలకు అవగాహన పెంచింది. ఎవరికైనా తలనొప్పి, జ్వరం, వాంతులు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉంటె వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది.

Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్‌ను అవమానించిన నయనతార?