Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Brahmanandam Life Career Telugu Comedy Legend

Brahmanandam: బ్రహ్మానందం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా..?

Published Date :October 5, 2025 , 9:40 pm
By RAMAKRISHNA KENCHE
Brahmanandam: బ్రహ్మానందం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Brahmanandam: తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్.. నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా మీమ్ గాడ్ కూడా ఆయనే. ఎంతటి సీరియస్ పరిస్థితి అయినా.. కన్నీరు తెప్పించే బాధలో ఉన్నా.. ఆయన ఫోటో కనిపిస్తే చాలు పెదాలపైకి చిరునవ్వు రావాల్సిందే. అందుకే ఆయనను హాస్యబ్రహ్మా అని పిలుచుకుంటారు. అయితే.. అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న బ్రహ్మానందాన్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో తొలిసారిగా నటించారు బ్రహ్మానందం. ఈ సినిమాకు అంతగా గుర్తింపు రాలేదు.

READ MORE: DK Shivakumar: కుల సర్వేలో ఆభరణాల ప్రశ్నకు నో చెప్పిన డీకే.శివకుమార్.. బీజేపీ రియాక్షన్ ఇదే!

ఆ సినిమా అనంతరం దిగ్గజ తెలుగు దర్శకుడు జంధ్యాల 1987లో తెరకెక్కించిన ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మానందం కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ సినిమాతో బ్రహ్మానందం సినీ ప్రవేశానికి గట్టి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాల్లో కామెడీ పటాసుళ్లా పేలింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘డబ్బు’, ‘జంబ లకిడి పంబ’, ‘యమలీల’, ‘అల్లుడా మజాకా’, ‘బావగారు బాగున్నారా?’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘పోకిరి’, ‘ఢీ’, ‘కృష్ణ’, ‘జల్సా’, ‘రెడీ’, ‘కిక్’, ‘అదుర్స్’, ‘దూకుడు’, ‘జులాయి’, ‘బలుపు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో అద్భుతంగా కామెడీ పండించారు. తనకు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు బ్రహ్మానందం. ఆయన నటించడం వల్లే మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలకగమానదు. అద్భుతన నటనతో 1,200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ahana Pellanta movie
  • Brahmanandam best scenes
  • Brahmanandam biography
  • Brahmanandam career story
  • Brahmanandam Guinness record

తాజావార్తలు

  • Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్

  • AP Weather Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • Jeevan Reddy : మంత్రులతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా జీవన్ రెడ్డి సంకేతాలు

  • SSB Constable Recruitment 2026: సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ పోస్టులు.. 10th, ఇంటర్ పాసైతే మిస్ చేసుకోకండి

  • Dhurandhar 2: సొంత భర్త సినిమాకు రాని దీపిక.. అసలేం జరుగుతోంది!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions