NTV Telugu Site icon

Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట

Balayya Boyapati Film

Balayya Boyapati Film

Akhanda 2 : నందమూరి బాల‌య్య బోయ‌పాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’తో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డ‌బుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవ‌ల ‘అఖండ‌-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. అలా బోయ‌పాటి-బాల‌య్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ‘అఖండ‌-2’ కోసం బోయ‌పాటి రెడీ అవుతున్నాడు. ‘డాకు మ‌హారాజ్’ విడుదల కాగానే బాల‌య్య అఖండ‌-2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వ‌స్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ‌-2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయ‌పాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయ‌పాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read Also:Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’

దీంతో ఇదే బోయ‌పాటి కెరీర్ భారీ రెమ్యున‌రేష‌న్‎గా తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మ‌హా అయితే 10 కోట్ల వ‌ర‌కూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాల‌య్య కుమార్తె తేజ‌స్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అంఖడ హ‌క్కులు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి. సెకండ్ పార్ట్ కూడా ఆయ‌నే నిర్మించాలి. కానీ ఆయ‌న స్థానంలో కొత్త నిర్మాత‌లు క‌నిపిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో వస్తున్నారు. సినిమాకు ఫ‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్లు తీసుకుంటున్నారు. తమ‌న్ ని య‌థావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండ‌కు ఆయ‌నే బాణీలను అందించిన సంగతి తెలిసిందే.

Read Also: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ

Show comments