Terror Attack: ఆర్మీ యూనిఫాంలో ఉగ్రవాదులు.. అసలైన భారత సైనికులను చూసి భయపడ్డ బాధితులు (వీడియో)

  • జమ్మూ కాశ్మీర్‌లో భయంకరమైన ఉగ్రదాడి
  • అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ఘటన
  • ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో ఉగ్రవాదులు
  • అసలైన భారత సైనికులను చూసి భయపడ్డ జనాలు
Pahalgam Terror3

Pahalgam Terror3

జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

READ MORE: CM Chandrababu: టీడీపీ నేత వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

తాజాగా ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రవాదులు సైతం సైనిక దుస్తుల్లో రావడంతో అసలైన భారత సైనికులను చూసి జనాలు భయాందోళనకు గురయ్యారు. వీడియో ప్రకారం.. స్థానికులు గాయపడిన ఓ మహిళ, ఓ బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. సురక్షిత ప్రాంతంలో భారత సైనికులు వారికి రక్షణగా ఉన్నారు. ఆర్మీ యూనిఫాంలో ఉన్న అసలైన సైనికులను చూసి ఆ బాలుడు ఒక్కసారిగా ఆరవడం మొదలు పెట్టాడు. ఆదే యూనిఫాంలో వచ్చిన ఉగ్రవాదులు కళ్లముందే తండ్రిని దారుణంగా కాల్చిచంపడాన్ని చూసిన బాలుగు భయంతో అరిచాడు. దయచేసి మమ్మల్ని వదిలేయండి.. నా కొడుకును చంపొద్దు.. అంటూ ఆ తల్లి ప్రాథేయపడింది. దీంతో అక్కడున్న సైనికులు మేము అసలైన సైనికులం, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం.. అని సమాధానం ఇచ్చారు. నా భర్తను చంపేశారు అన్నా అంటూ ఆ మహిళ రోదనలు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.

READ MORE: Delhi Capitals: ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. భావోద్వేగ పోస్ట్..

కాగా.. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోయారు.