చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప లో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ గృహకల్పలోని భవనం మూడవ అంతస్తుపై నుండి ఆడుకుంటూ 17 నెలల బాలుడు రిజ్వాన్ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. అయితే.. తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్ కు తరలించడంతో.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాజీవ్ గృహకల్పలోని భవనాలకు ఎక్స్ట్రా స్లాబ్ లు వేసి వదిలేశారు యజమానులు. తమ ఒక్కగానొక బాలుడు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదానికి కారణమైన భవన యజమనులను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లితండ్రులు కోరుతున్నారు. ఇది వరకు ఇలానే ఇలాంటి భవనంపై నుండి ఆడుకుంటూ బాలిక కింద పడింది. గాయలయాతో వారం హాస్పిటల్ లో చికిత్స పొంది ప్రాణాపాయం నుండి బయటపడింది బాలిక.. అయితే.. ఈ మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.