NTV Telugu Site icon

Team India: టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్..

Khaleel Ahmed

Khaleel Ahmed

టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్‌ ఉన్నాడు.

2019 తర్వాత ఖలీల్ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ఈ క్రమంలో.. అతని ప్రదర్శన చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనిపై విశ్వాసం ఉంచి టీ20 వరల్డ్ కప్ లో రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. ప్రపంచకప్‌ రిజర్వ్‌ ఆటగాళ్లలో చోటు దక్కించుకోవడంపై ఖలీల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిదని ఆవేదన వ్యక్తం చేశాడు.

TSMS Inter Admissions: మోడల్ స్కూల్ ‘ఇంటర్’ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇలా..

గత ఏడాది ఐపీఎల్ తర్వాత కేవలం ఒక వారం మాత్రమే విరామం తీసుకున్నానని.. నిరంతరం క్రికెట్ ఆడానని ఖలీల్ చెప్పాడు. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో.. విశ్రాంతి కూడా అంతే అవసరం. కానీ ఖలీల్ ప్రాక్టీస్ కోసం, మ్యాచ్‌లు ఆడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తన ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “గత IPL తర్వాత, నేను కేవలం ఒక వారం విరామం తీసుకున్నాను. నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నేను అన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా చూసుకున్నాను.” అని తెలిపాడు. “నాకు ఏమి జరిగినా అన్ని మ్యాచ్‌లు ఆడాలని నేను నిర్ణయించుకున్నాను. గత సంవత్సరం నేను మానసికంగా బాధపడ్డాను. అన్ని క్రికెట్ మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించకున్నాను. ఎందుకంటే నా జీవితం కేవలం క్రికెట్ మాత్రమే.” అని చెప్పుకొచ్చాడు.

మరోవైపు.. ఐపీఎల్‌ ఆడటం వల్ల ఆత్మవిశ్వాసం వచ్చిందని ఖలీల్ చెప్పాడు. “గత కొన్ని నెలలుగా గడిచిన మార్గంలో, ఏదో మంచి జరగబోతోందని నేను భావించాను. ఐపీఎల్ మ్యాచ్‌లు గడిచేకొద్దీ, నా ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. నేను బాగా బౌలింగ్ చేస్తున్నానని గ్రహించాను. చివరికి నా పేరు వచ్చింది.” అన్నాడు. “నేను టీవీలో ఇండియా ఆటను చూసినప్పుడల్లా, నేను ఈ స్థానంలో ఉంటే నేను ఏమి చేసేవాడిని అని ఆలోచించాను. అందుకోసం ప్రతి రోజు పోరాడేవాడిని.” అని పేర్కొన్నాడు.