KK Line: అల్లూరి సీతారామరాజు జిల్లా కేకే లైన్‌లో శివలింగపురం వద్ద రైల్వే ట్రాక్ పై జారిపడింది పెద్ద బండరాయి.. అయితే, ఆ బండరాయిని ఢీకొని గూడ్స్ రైలు ఇంజిన్ దెబ్బతింది.. దీంతో.. ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రైల్వే అధికారులు.. కేకే లైన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో.. ఎస్.కోటలో విశాఖ – కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోగా.. రైల్వేశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.. ఎస్ కోట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, పర్యాటకులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.. వీలైనంత త్వరగా కేకే లైన్‌ను క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలు యథావిథిగా సాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.. కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్‌పై గతంలోనూ రైల్వే ట్రాక్ పై బండరాళ్లు పడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి.. ముఖ్యంగా వర్షా కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన విషయం విదితమే.
Read Also: Prathinidhi 2 : ఎన్నికలకు మూడు రోజుల ముందు వచ్చేస్తున్న ప్రతినిధి 2