Bonda Uma: కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేశారన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని తెలిపారు. మేమిచ్చిన కంప్లైంటుపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు పార్టీ అభ్యర్థులతో ఓ వర్క్ షాప్ నిర్వహించాం..
ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని తెలిపారు.
Abraham Ozler Review: మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్ మావా.. అబ్రహాం ఓజ్లర్ రివ్యూ
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించనున్న ఫుట్‌బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తమ సమావేశంలోకి వచ్చారని.. ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారన్నారు. కేశినేని చిన్ని కదలికల మీద నిఘా పెట్టినట్టు తమకు తెలిసిందని బోండా ఉమా పేర్కొన్నారు. కేశినేని చిన్నిని కదలికలపై నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్ లో తమకు లభ్యమయ్యాయని చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ట్యాపింగ్ ప్రక్రియ చేపట్టారని.. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు నిర్దారణ అయిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగుపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. పీఎస్సార్ సహా ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలని బోండా ఉమా కోరారు.
PBKS vs DC: చివరి ఓవర్లో చితక్కొట్టిన అభిషేక్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ.. తన ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నించిందని అన్నారు. ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను పట్టుకుంటే అసలు విషయాలు వచ్చాయని.. వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ కు తొత్తుల్లా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలపై నిఘా పెట్టే బదులు.. డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంపై పీఎస్సార్ ఆంజనేయులు దృష్టి పెట్టాలని టీడీపీ నేత పట్టాభి పేర్కొన్నారు. జగన్ సింగిల్ కాదు.. ఆయన వెంట మాఫియా ఉందని ఆరోపించారు.
జగన్ మాఫియాకు.. ప్రజలకు మధ్య యుద్దం జరుగుతోందని పట్టాభి తెలిపారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించనున్న ఫుట్‌బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్‌లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..