Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బొమ్మరిల్లు రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా బొమ్మరిల్లు సినిమాను ఏప్రిల్‌లో రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న సిద్ధార్థ్ బర్త్ డే. అదే రోజున బొమ్మరిల్లు రీ-రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య రీ రిలీజ్ చేసిన సిద్ధార్థ్ ‘ఓయ్’ సినిమా ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని షోలు వేసినా.. హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అప్పుడు పెద్దగా ఆడని ఓయ్ సినిమా రీ-రిలీజ్‌లో దుమ్మురేపింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఓయ్ చిత్రంకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన బొమ్మరిల్లు సంగతి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Ravichandran Ashwin: భారత తొలి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు!
ఒకప్పుడు సిద్ధార్థ్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, ఆట సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇతర భాషల వైపు చూసి.. తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు. అడపాదడపా సినిమాలు చేసినా.. పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఇటీవల ‘చిన్నా’ సినిమాతో సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.