Bomb Found in Gurudwara: పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు. కారు పార్కింగ్ స్థలంలో మట్టిలో బాంబు దొరికినట్లు తెలిసింది. ఈ బాంబు ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. భద్రత కోసం ఆ ప్రాంతంలో అదనపు సిబ్బందిని పోలీసులు మోహరించారు.
Read Also: Extramarital Affair: ఆమె పాలిట శాపంగా మారిన వివాహేతర సంబంధం.. అసలేమైందంటే?
బాంబు దొరకడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవారిని వెంటనే అక్కడి నుంచి దూరంగా పంపించారు. బాంబును స్వాధీనం చేసుకుని ఎవరు పెట్టారని విచారిస్తున్నారు. బాంబు దొరకడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.