Bomb Blast In Night Club: నైట్ క్లబ్లో పేలుడు.. దోపిడీ కోసమేనా?
- చండీగఢ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు
- నైట్ క్లబ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast In Night Club: మంగళవారం తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. సెక్టార్ 26లో ఉన్న నైట్‌క్లబ్‌పై అనుమానిత దుండగులు పేలుడు పదార్థాలను విసిరారు. నైట్ క్లబ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలు విసిరినట్లు సమాచారం. ఆ క్లబ్ రాపర్ బాద్షాకు చెందినది. అయితే, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని ఖండించారు. సెక్టార్ 26లో ఉన్న నైట్ క్లబ్‌పై ఇద్దరు గుర్తుతెలియని బైకర్లు అనుమానాస్పద పేలుడు పదార్థాలను విసిరినట్లు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది చాలా తక్కువ సామర్థ్యం గల పేలుడు అని సమాచారం. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
Also Read: Pushpa 2 Update: హమ్మయ్య.. ఓ పనైపోయింది! ఫాన్స్ రెడీ అయిపోండమ్మా
Also Read
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
- AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
#चंडीगढ़ के सेक्टर 26 स्थित दो क्लबों के बाहर धमाके, दो बाइक सवार युवकों की ओर से विस्फोटक पदार्थ फेका गया, घटना स्थल पर पहुँची पुलिस, जाँच जारी@rishuraj_chd #Chandigarh pic.twitter.com/OAEbk5bH6o
— Sahil Rukhaya (@Sahilrukhaya7) November 26, 2024
రాపర్ బాద్షా నైట్ క్లబ్లో ఈ పేలుడు జరిగినట్లు ఇది వరకు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ పేలుడు బాద్షా క్లబ్ సెవిల్లెలో జరగలేదని, డి.ఓర్రా (De.orra)లో జరిగిందని చండీగఢ్ పోలీసులు స్పష్టం చేశారు. దీని పక్కన కింగ్స్ నైట్ క్లబ్ సెవిల్లె ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో క్లబ్ కిటికీలు పగిలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు వార్త అందుకున్న చండీగఢ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. బాంబు నిర్వీర్య స్క్వాడ్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాలు కూడా సంఘటనా స్థలం నుండి నమూనాలను సేకరించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఈ దేశీయ బాంబులను విసిరినట్లు సంబంధిత వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, ఈ దాడి వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చండీగఢ్ పోలీసులు ఫోరెన్సిక్ బృందాల సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
-
December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
ట్రెండింగ్
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..