అర్జిత్ సింగ్.. ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని ఒక మాధుర్యం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన గొంతులో నుంచి పాట వచ్చిందంటే అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరి ఫోన్లో సాంగ్ లిస్ట్‌లో అర్జిత్ సాంగ్స్ ఉండాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న ఈ స్టార్ సింగర్ ఇప్పుడు తన అభిమానులకు ఒక కోలుకోలేని వార్త చెప్పారు. ఇకపై తాను ప్లే-బ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు, తన వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
Also Read : Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
2005లో ‘ఫేమ్ గురుకుల్’ రియాలిటీ షోతో మొదలైన అరిజిత్ ప్రయాణం.. ఇండియన్ సినిమాలోనే అత్యంత ఖరీదైన సింగర్‌గా ఎదిగే వరకు సాగింది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ్ భాషల్లో ఎన్నో పాటలను పాడారు. అలాంటిది తాజాగా ‘ఇకపై నేను ప్లే-బ్యాక్ సింగర్‌గా పాటలు పాడను. ప్రస్తుతం నేను ఏ సినిమాలకైతే కమిట్ అయ్యానో, వాటికి మాత్రమే పాడతాను. ఆ తర్వాత నుంచి నా రిటైర్మెంట్ మొదలవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా ఎక్స్ (ట్విట్టర్) లో కూడా ఈ ఏడాది విడుదలయ్యే తన పెండింగ్ సాంగ్స్ గురించి సమాచారం ఇచ్చారు. దీంతో అరిజిత్ గొంతును వెండితెరపై వినేది ఈ ఏడాదే చివరి సారి కాబోతోంది. దీంతో
అర్జిత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటీ? అటు బాలీవుడ్లో, ఇటు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో అసలు ఇంత సడెన్‌గా అర్జిత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? వ్యక్తిగత కారణాలా లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తన మెలోడీ పాటలతో ఇన్నాళ్లు ఊరటనిచ్చిన అరిజిత్ గొంతు ఇకపై వినిపించదు అనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై అర్జిత్ పూర్తిస్థాయిలో స్పందిస్తారో లేదో చూడాలి.