NTV Telugu Site icon

Disha Patani : సీకే బ్రాండ్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. మామూలు గ్లామర్ కాదు బాబోయ్

New Project 2024 11 07t133020.695

New Project 2024 11 07t133020.695

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఫోటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బాలీవుడ్ నటి తన బోల్డ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. బికినీ వేసినా, స్పోర్ట్స్ బ్రా ,ప్యాంటీలతో పోజులిచ్చినా దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్‌లతో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రసిద్ధ కాల్విన్ క్లైన్ లోదుస్తుల బ్రాండ్‌లో నాలుగు నుండి ఐదు సంవత్సరాలు గడిపిన తర్వాత, దిశా చాలా పనులు చేస్తూ కనిపించింది. ఇప్పుడు మరోసారి సీకే బ్రాండ్ అండర్ వేర్ లో కలకలం రేపింది.

Read Also:Andhra Pradesh: 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన

క‌రోనా కంటే ముందు నుంచే దిశా ప‌టానీ సీకే బ్రాండ్ కి ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. 2020 దీపావ‌ళికి మొద‌టిసారి కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తులు ధ‌రించి దీపారాధ‌న చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ల‌క్ష్మీ దేవి వ‌స్తుంద‌నుకుంటే సీకే (న్యూ*) దేవి వ‌చ్చిందంటూ కొందరు సాంప్రదాయవాదులు వాపోయారు. కానీ ఆ జిమ్మిక్ సీకే బ్రాండ్ ప్రచారానికి పెద్ద రేంజులో వర్కవుట్ అయిపోయింది. యూత్ కి బ్రాండ్ ని ఒక రేంజులో క‌నెక్ట్ చేయ‌డంలో దిశా పెద్ద సక్సెస్ సాధించింది. ప్రతీసారి ఏదో ఒక సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకుని వివాదాస్ప‌ద ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తూ మొత్తానికి సీకేకు బోలెడంత ప్రచారం తెచ్చిపెడుతుంది.

Read Also:Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

అయితే నాలుగేళ్లుగా దిశా ప‌టానీని సీకే బ్రాండ్ కొన‌సాగిస్తోందంటే దాన‌ర్థం.. ఆ బ్రాండ్ విలువను అమాంతం పెంచ‌గ‌లిగే స‌త్తా ఉన్న ఏకైక తార దిశా పటానీ మాత్రమే. అయితే ఇన్నేళ్ల‌లో ఈ ఒక్క బ్రాండ్ తో దిశా ప‌టానీ ఎంత సంపాదించి ఉంటుందని రకరకాల సందేహాలు పుట్టుకొస్తున్నాయి కొందరికీ. ఓవైపు సినిమాలు చేస్తూనే బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న దిశ ఇప్ప‌టికే సుమారు 60 కోట్ల సంప‌ద‌ల‌తో ఫోర్బ్స్ జాబితాలోను చేరిపోయింది. ఇటీవ‌లే బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ADలో చివరిగా కనిపించింది. దీనికోసం కోట్లలో పారితోషికం అందుకుంది. త‌దుప‌రి క‌ల్కి 2లోను త‌న పాత్రకు స్కోప్ ఉంటుంది. త‌దుప‌రి మ‌రో పాన్ ఇండియా చిత్రం కంగువతో అభిమానుల ముందుకు రానుంది. కంగువ నవంబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శుభ స‌మ‌యాన దిశా ప‌టానీ త‌న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Show comments