Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ

Tollywood (3)

Tollywood (3)

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ కొత్తందాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యుఫోరియాతో టీటౌన్ ఎంట్రీ తీసుకుంది సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఈ అమ్మాయి.. ధురంధర్‌తో పూర్తిగా హీరోయిన్ మెటీరియల్‌గా మారింది. ఈ సినిమా కన్నా ముందే యుఫోరియాకు కమిటైన ఈ యంగ్ బ్యూటీ.. ఇందులో మైనర్ గర్ల్‌గా కనిపించింది. గత ఏడాది బాలీవుడ్ తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ రాషా తడానీ.

Also Read : Tollywood : టాలీవుడ్‌లో సెన్సార్ సెగ.. మారుతున్న సినిమాల టైటిల్స్..’హే భగవాన్’ కాస్తా ‘హే బలవంత్’

ఆజాద్ మూవీతో అడుగుపెట్టిన రవీనా తనయ.. ఆ బొమ్మ ఫ్లాపైనా వూయమ్మ అంటూ యూత్‌ను కట్టిపడేసింది. నెక్ట్స్ సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి లాంచ్ అవుతోంది భామ. మహేష్ బాబు బ్రదర్ రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతోన్న శ్రీనివాస మంగాపురంలో మంగాగా కనిపించబోతుంది రాషా. ఈ నట వారసుల్ని తెరకు పరిచయం చేయబోతున్నాడు అజయ్ భూపతి. లపతా లేడీస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న బాలీవుడ్ న్యూ టాలెంట్ గర్ల్ నితాన్షీ గోయల్ టాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టబోతుంది. అయితే ఈమె థియేటర్స్ ఆడియన్స్ కాకుండా ఓటీటీతో హాయ్ చెప్పబోతుంది. ఆనంద్ దేవరకొండతో తక్షకుడు అనే మూవీలో నటిస్తోంది నితాన్షీ. తర్వలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరవయ్యేది ఎవరో..? లెట్స్ సీ

Exit mobile version