NTV Telugu Site icon

Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Ram Charan, Buchi Babu

Ram Charan, Buchi Babu

Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్‌, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అందులో కృతి సనన్ కనిపిస్తారని తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Nagpur Bus Driver: చేతికి బుల్లెట్‌ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెలాఖరు వరకు వైజాగ్‌లోనే షూటింగ్ జరగనుంది. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చరణ్ భావిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో.. బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో చరణ్‌ రెండు పాత్రలో కనిపించనున్నాడు. కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.