NTV Telugu Site icon

Kareena Kapoor-Yash: కేజీఎఫ్ స్టార్ ‘యశ్‌’ సరసన కరీనా కపూర్‌?

Kareena Kapoor Yash

Kareena Kapoor Yash

Kareena Kapoor to make her South Debut with Yash in Toxic: రవీనా టాండన్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, అమృతా రావు, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, శ్రద్దా కపూర్.. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది పరిశ్రమలో సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ నటించగా.. ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే, ‘దేవర’లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ దక్షిణాది సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. ‘కరీనా కపూర్‌’. కేజీఎఫ్ స్టార్ యశ్‌ సరసన కరీనా నటించనుందట.

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ తర్వాత యశ్‌ నటిస్తున్న సినిమా టాక్సిక్‌. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కెవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె నారాయణ నిర్మిస్తున్నారు. టాక్సిక్‌ సినిమాలో కరీనా కపూర్‌ నటించనుందని తెలుస్తోంది. తాను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నానని, అది పాన్‌ ఇండియా ప్రాజెక్టు అని తాజాగా కరీనా చెప్పారు. దీంతో యశ్‌ నటిస్తున్న టాక్సిక్‌లో కరీనా కనిపించనున్నట్లు ఫాన్స్ అంటున్నారు.

Also Read: IPL 2024: అభిమానులకు శుభవార్త.. భారత్ చేరుకున్న విరాట్ కోహ్లీ! ‘కింగ్’ వీడియో వైరల్

కరీనా కపూర్‌ తాజా చిత్రం ‘ది క్రూ’. ఈ సినిమాలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా కరీనా జూమ్ మీటింగ్‌లో అభిమానుల ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ… ‘నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నా. అది పాన్‌ ఇండియా ప్రాజెక్టు. నేను ఎక్కడ షూటింగ్ చేస్తానో నాకు ఇంకా తెలియదు. మొదటిసారి ఇలాంటి సినిమాలో పనిచేస్తున్నాను’ అని చెప్పారు. ఇటీవలి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న కరీనా.. తనకు యశ్‌తో కలిసి నటించాలనుందని చెప్పారు.

Show comments