Kareena Kapoor-Yash: కేజీఎఫ్ స్టార్ ‘యశ్’ సరసన కరీనా కపూర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kareena Kapoor to make her South Debut with Yash in Toxic: రవీనా టాండన్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, అమృతా రావు, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, శ్రద్దా కపూర్.. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది పరిశ్రమలో సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ నటించగా.. ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే, ‘దేవర’లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ దక్షిణాది సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. ‘కరీనా కపూర్’. కేజీఎఫ్ స్టార్ యశ్ సరసన కరీనా నటించనుందట.
‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ నటించనుందని తెలుస్తోంది. తాను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నానని, అది పాన్ ఇండియా ప్రాజెక్టు అని తాజాగా కరీనా చెప్పారు. దీంతో యశ్ నటిస్తున్న టాక్సిక్‌లో కరీనా కనిపించనున్నట్లు ఫాన్స్ అంటున్నారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Also Read: IPL 2024: అభిమానులకు శుభవార్త.. భారత్ చేరుకున్న విరాట్ కోహ్లీ! ‘కింగ్’ వీడియో వైరల్
కరీనా కపూర్ తాజా చిత్రం ‘ది క్రూ’. ఈ సినిమాలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా కరీనా జూమ్ మీటింగ్‌లో అభిమానుల ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ… ‘నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నా. అది పాన్ ఇండియా ప్రాజెక్టు. నేను ఎక్కడ షూటింగ్ చేస్తానో నాకు ఇంకా తెలియదు. మొదటిసారి ఇలాంటి సినిమాలో పనిచేస్తున్నాను’ అని చెప్పారు. ఇటీవలి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న కరీనా.. తనకు యశ్‌తో కలిసి నటించాలనుందని చెప్పారు.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?