Bollywood Actors Arrest : మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood Actors Arrest : హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపూర్ అశ్విణ్, నటాషా కపూర్ అనే ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు మోడలింగ్ లో శిక్షణ ఇచ్చి అవకాశాలు ఇస్తామని చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని వాటిలో మీకు అవకాశాలు ఇస్తామంటూ వారు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ హీరోయిన్ రష్మికతో కలిసి మోడలింగ్ చేసే అవకాశం ఉందంటూ మాయమాటలు చెప్పడంతో ఒక వ్యాపారవేత్త నమ్మి రూ.20 లక్షలు సమర్పించుకున్నట్లు సమాచారం. కేవలం వ్యాపారవేత్తల పిల్లలకు మాత్రమే అవకాశం ఇస్తామని అందుకు కొంత మొత్తం తీసుకుంటామని చెబుతూ ఒక వ్యాపారవేత్త నుంచి దాదాపుగా 20 లక్షలు ఈ జంట వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్నారు ఈ ఇద్దరు. 20 లక్షలు ఇచ్చినా .. ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎలాంటి కబురు లేక పోవడంతో తాను మోసపోయాననే విషయం అర్థం చేసుకుని వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు ఈ విషయమై దర్యాప్తు జరిపి వీరిద్దరూ కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు. వీరిద్దరినీ ప్రస్తుతానికి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నా సామాన్యులు ఆశపడి మోసపోతున్న ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!