Site icon NTV Telugu

Madhya Pradesh:చిన్నారి మృతదేహంతో మేనమామ.. బస్ టిక్కెట్ కి కూడా డబ్బుల్లేక

Dead Body

Dead Body

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో కంటతడి పెట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లభించడంలేదు. ఉన్నా సిబ్బంది వేలల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో మృతదేహాలను తరలించేందుకు బాధిత కుటుంబీకులు నానావస్థలు పడుతున్నారు. తాజాగా అంబులెన్స్ లేకపోవడంతో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల మేన కోడలి మృతదేహాన్ని భుజాన వేసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. రద్దీగా ఉండే రోడ్డులో బస్టాప్ వైపు నడుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Smart Phone : స్మార్ట్ ఫోన్ కోసం రక్తాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 16ఏళ్ల బాలిక

మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, తిరిగివచ్చే సమయంలో చిన్నారి సమీపబంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎటువంటి ప్రభుత్వ వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే.. వేలల్లో డబ్బులు డిమాండ్ చేశారు. చేసేదీలేక సరిపడా డబ్బులు లేక.. చిన్నారి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ బస్టాండ్‌కు వెళ్లాడు ఆ వ్యక్తి. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడు ఒకరు సహాయం చేశారు. ‘మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడం పట్టణాభివృద్ధి శాఖ పని… ఆసుపత్రిని, వైద్యులను ఇందులోకి లాగవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాను, ”అని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ చెప్పాడు.

Read Also: Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట

నాలుగు నెలల క్రితం ఇదే ఆసుపత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఛతర్‌పూర్‌ జిల్లాలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version