NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో దారుణం.. ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహం!

Dehisa

Dehisa

దేశ రాజధాని ఢిల్లీలో యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మృతదేహాన్ని కిందికి దించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..

అయితే అతడి వయసు 25-30 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్యా? లేక హత్యా అనేది తేలాల్సి ఉంది. యువకుడి వివరాలు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచే వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. పశ్చిమ ఢిల్లీలోని కరాలా ప్రాంతంలోని ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ఇనుప గ్రిల్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ వ్యక్తి వివరాలు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే.. మిస్టరీ వీడనుంది.

ఇది కూడా చదవండి: Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? మీరు డేంజర్లో పడ్డట్లే..