తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ముంగేలిలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈస్ట్ ఢిల్లీలోనే కల్యాణ్‌పురి ఏరియాలో సాయంత్రం ఒక్కసారిగా భవనం కూలిపోయింది.