మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల గోదావరినదిలో నాటుపడవ బోల్తాపడింది. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి వెళ్లిన మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు మత్స్యకారులు.. గోదావరి ప్రవాహంలో నాటు పడవ తీసుకువస్తుండగా అన్నారం సరస్వతీ బ్యారేజ్ 11 వ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా నాటుపడవ మునిగింది.. గడ్డం వెంకటస్వామి, తూనిరి కిష్టాస్వామి గల్లంతయ్యారు. కిష్టస్వామి ఈత కొడుతు సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రవాహంలో గల్లంతైన వ్యక్తి గడ్డం వెంకటేష్(48)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలకు ఏర్పాట్లు చేశారు.