NTV Telugu Site icon

BMW: ఇది కారు కాదు.. ఊసరవెల్లి.. 240 రంగులు మారుస్తుందట..!!

Bmw

Bmw

BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా ఈ కారు 240 రంగులను మార్చుకోగలదు. ఈ కారు 2025 నుంచి మన దేశ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని బీఎండబ్ల్యూ వివరించింది.

Read Also: Spring Fields: 800 ఏళ్ల ఇస్లామిక్ స్వర్ణయుగాన్ని ప్రదర్శించిన స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఇన్‌స్టిట్యూట్

లాస్‌వెగాస్‌లో జరుగుతున్న CES ఈవెంట్‌లో బీఎమ్‌డబ్ల్యూ ఈ రంగులు మార్చే కారును ప్రదర్శించింది. ఐ విజన్ డీ పేరుతో లాస్ వెగాస్‌లోని CES ఈవెంట్‌‌లో బీఎండబ్ల్యూ ఈ కారును ప్రదర్శించింది. ఈ మోడల్ కారుకు సంబంధించి మూడు బాడీ డిజైన్‌లను పరిచయం చేసింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది దాని రంగును అదే మార్చుకోగలదు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 240 రకాల రంగులను మార్చుకోగలదు. ప్రస్తుతం ప్రోటోటైప్ అయినప్పటికీ కంపెనీ దీని ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది. ప్రజల స్పందన చూసి త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్ టెక్నాలజీ ఆటో ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దాదాపు 240 రంగులను మార్చుకోవడం అనేది బీఎండబ్ల్యూ ఐ విజన్ డీ కారుకు Ink టెక్నాలజీతో సాధ్యమైంది. ఈ టెక్నాలజీని కారులోని అన్ని భాగాలలో ఉపయోగించారు. ప్రతి ప్యానెల్‌లో 32 రంగుల ఎంపికలు ఉన్నాయి. తద్వారా మీరు ఈ కారును ఒకే సమయంలో వేర్వేరు రంగులలోకి మార్చవచ్చు. ఈ కారులో రంగు మారడమే కాకుండా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రొజెక్టింగ్ డ్రైవెన్ డేటా టెక్నాలజీని కూడా కలిగి ఉండబోతుంది. దాని సహాయంతో కారు విండ్‌షీల్డ్‌పైనే డిజిటల్ ఫార్మాట్‌లో డ్రైవింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది నావిగేషన్, స్పీడ్, మైలేజ్ వంటి సమాచారాన్ని విండ్‌షీల్డ్‌లోనే ప్రదర్శిస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదు. అయితే ఈ కారు విడుదల తేదీకి సంబంధించిన తేదీని బీఎండబ్ల్యూ కంపెనీ రివీల్ చేయలేదు. దీంతో కారు ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.