NTV Telugu Site icon

Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..

Group 2 Mains

Group 2 Mains

సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది. హాల్‌టికెట్ పై కేఓఆర్ఎం నియర్ బై కేఎస్ఆర్ఎమ్ అని ఉండడంతో కేఎస్ఆర్ఎం పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. తాను రాయాల్సిన పరీక్ష పేపర్ రాకపోవడంతో 10 గంటల 45 నిమిషాలకు అధికారులు బయటకు పంపారు. సకాలంలో తనకు వివరాలు తెలిపి ఉంటే పక్కనే ఉన్న కేఓఆర్ఎమ్ సెంటర్‌కు చేరుకునే దానినంటూ సంజన ఆవేదన వ్యక్తం చేసింది. 11 గంటలకు కేఎస్ఆర్ఎం కాలేజీని చేరుకున్నప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో.. చేసేది ఏమీ లేక గ్రూప్-2 పరీక్ష రాయకుండా వెనుతిరిగింది అంధ అభ్యర్థిని సంజన.

Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలని శుక్ర, శని వారాల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ.. ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించింది ఏపీపీఎస్సీ. కాగా, ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో మొత్తం 92,250 మంది మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరుగుతున్నాయి.

JioTele OS: జియోటెలీ OS తో విడుదలైన తొలి స్మార్ట్ టీవీ.. ధర ఎంతంటే?