అమెరికాలో మరో దారుణం జరిగింది. 2020లో అమెరికాలో పోలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిండ్ తరహాలోనే.. మరో నల్లజాతీయుడు మృత్యువాత పడ్డాడు. ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తికి (53) సంకెళ్లు వేస్తూ.. మరొకరు మెడపై మోకరిల్లి.. కొన్ని సెకన్లు పాటు ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోరానికి సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Bihar : ఐదు గంటలు, 12 కుట్లు.. సింహానికి ఆపరేషన్ చేసిన వైద్యులు
ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్‌లో బలవంతగా పట్టుకున్నారు. బార్‌లో ఉన్న ఫ్రాంక్ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Sukumar : సుహాస్ ను నానితో పోల్చిన సుకుమార్.. ఆ ఒక్క మాటతో ఫిదా..
ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యాడు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్‌ను కోర్టు కఠిన శిక్ష విధించింది. తాజాగా అదే తరహాలో ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికలకు సిద్ధపడుతున్న అమెరికాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Canton, Ohio
Bodycam footage of Frank Tyson pic.twitter.com/RvpE4Meuib
— The Daily Sneed™ (@Tr00peRR) April 26, 2024
