హీరో సుహాస్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది.. ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా సుహాస్ నటిస్తున్న ‘ప్రసన్న వదనం ‘ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ చేశారు..
ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ సినిమాల పై ప్రశంసలు కురిపించారు.. సుహాస్ లాంటి నటుడు ఇండస్ట్రీకి అవసరం అని అన్నాడు.. అలాగే న్యాచురల్ స్టార్ నాని లాగా సుహాస్ పైకొచ్చాడు.. ఆయనను సహజ నటుడు అంటే సుహాస్ మట్టి స్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు.. సుహాస్ నువ్వంటే నాకు, అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. అల్లు అర్జున్ నీ గురించి చాలా సార్లు మాట్లాడాడు. ఫస్ట్ పుష్పలో జగదీశ్ చేసిన కేశవ క్యారెక్టర్ కి నేను, బన్నీ నిన్నే అనుకున్నాం. కానీ నువ్వు అప్పటికే హీరోగా చేస్తుండటంతో నిన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడగడం ఏం బాగుంటుందని ఆగాము అని సుక్కు అన్నాడు..
ఇలాగే కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తు మంచి స్థానంలో ఉండాలని కోరుకున్నాడు.. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందని అన్నాడు.. ఇక సుకుమార్ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది..