అమెరికాలో మరో దారుణం జరిగింది. 2020లో అమెరికాలో పోలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లిజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిండ్ తరహాలోనే.. మరో నల్లజాతీయుడు మృత్యువాత పడ్డాడు. ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తికి (53) సంకెళ్లు వేస్తూ.. మరొకరు మెడపై మోకరిల్లి.. కొన్ని సెకన్లు పాటు ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.