Site icon NTV Telugu

Black Magic: కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు..

Kcr House

Kcr House

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 14లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం రేపుతుంది. కేసీఆర్‌ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో మంగళవారం నాడు మధ్యాహ్నం ముగ్గు మధ్యలో ఒక బొమ్మకు పసుపు కుంకుమ చల్లి ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయలు, మిరపకాయలు ఇతర సామగ్రిని గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం నందినగర్‌ బస్తీలో వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఈ క్షుద్ర పూజలపై విచారణ చేస్తున్నారు.

Read Also: PM Modi : శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే ?

ఇక, సోమవారం నాడు అర్ధరాత్రి కొంత మంది యువకులు ఖాళీ స్థలంలో కనిపించారని స్థానిక ప్రజలు చెప్పుకొచ్చారు. ఇది ఎవరైనా అకతాయిల పని కావొచ్చని మరి కొందరు తెలిపారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తూ విచారణ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెళ్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్లు సమాచారం. అసలు ఇంటి సమీపంలో క్షుద్రపూజలు ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Exit mobile version