NTV Telugu Site icon

Black magic: బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామను చంపేందుకు కోడలు కుట్ర..

Blcok Magic

Blcok Magic

ఈ రోజుల్లో ఫేక్ బాబాలను సోషల్ మీడియాలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాం. తమ వద్దకు వెళ్లితే వారి సమస్య పరిష్కారం అవుతుందని వెళ్తే.. డబ్బుల కోసం వారినే బురిడి కొట్టిస్తున్నారు. ఇంకొదరైతే.. ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకుంటున్నారు. తాము చెప్పినట్లుగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికిస్తూ.. బురిడి బాబాలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఓ బురిడి బాబా వ్యవహారం బట్టబయలైంది.

Read Also: Jaggery Benefits: బెల్లంతో గ్యాస్ ఉబ్బరాన్ని ఇలా పోగొట్టుకోవచ్చు!

హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేస్తున్న రౌడీ షీటర్ మహమ్మద్ ఖలీంను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి అగరబత్తీలు, కుంకుమ, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Uddhav Thackeray: కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రకటించిన సీఎం అభ్యర్థికి శివసేన మద్దతు ఇస్తుంది..

Show comments