NTV Telugu Site icon

Suresh Gopi: ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన కేంద్రమంత్రి..

Suresh Gopi

Suresh Gopi

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను ‘ధైర్యవంతమైన నిర్వాహకుడు’ అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్‌ తన “రాజకీయ గురువులు” అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్‌ స్మారకం “మురళీ మందిరం”ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.

Pushpa 2 : పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?

కరుణాకరన్ స్మారక సందర్శన రాజకీయంగా చూడొద్దని.. తన “గురువు”కి నివాళులు అర్పించేందుకే ఇక్కడకు వచ్చానని సురేష్ గోపీ చెప్పారు. కరుణాకరన్, ఇకె నాయనార్‌ కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. తాను ఇందిరాగాంధీని “భారతమాతగా భావిస్తానని, కరుణాకరన్ “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి” అని గోపి అన్నారు. కరుణాకరన్‌ను కేరళలో కాంగ్రెస్‌కు “తండ్రి”గా అభివర్ణించడం.. దక్షిణాది రాష్ట్రంలోని పార్టీ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని ఆయన వివరించారు.

Minister Achchennaidu: విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దు.. మంత్రి అచ్చెన్న ఆదేశం.

కరుణాకరన్ పరిపాలనా సామర్థ్యాలను కేంద్రమంత్రి సురేష్ గోపీ ప్రశంసించారు. అతని తరానికి చెందిన “ధైర్యవంతమైన నిర్వాహకుడు” అని అన్నారు. 2019లో మురళీ మందిరాన్ని సందర్శించాలని తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ, ఇటీవల బీజేపీలో నుంచి వెళ్లిన సీనియర్ నేత కుమార్తె పద్మజ వేణుగోపాల్ రాజకీయ కారణాలు తనను నిరుత్సాహపరిచారని ఆయన పేర్కొన్నారు. అనంతరం నగరంలోని ప్రముఖ లూర్ద్ మాతా చర్చిని సురేష్ గోపి సందర్శించి ప్రార్థనలు చేశారు. తన కుమార్తె వివాహం సందర్భంగా సెయింట్ మేరీ విగ్రహానికి బంగారు కిరీటాన్ని సమర్పించడాన్ని రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. కిరీటం పసుపు లోహంతో తయారు చేశారని.. రాగితో తయారు చేశారని ఆరోపించారు. కాగా.. గోపీ సురేష్ త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది కేరళలో బీజేపీ ఖాతా తెరిచారు.