Mamata Benerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సహకార సంఘంలోని మొత్తం 12 స్థానాలకుగాను టీఎంసీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. మిగతా 11 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది.
మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు.
Chandigarh University Row: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు
అయితే, గత నెలలో జరిగిన సహకార ఎన్నికల్లో తృణమూల్ జయకేతనం ఎగురవేసింది. నందిగ్రామ్ రెండో బ్లాక్‌లో తృణమూల్‌కు 51 స్థానాలు దక్కగా, సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది. అదేవిధంగా హనుభూనియా, గోల్‌పుకూర్, బిరూలియా సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. పై ఏ ఒక్క సహకార సంఘంలోనూ బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మమతా బెనర్జీ పార్టీ కొంటాయ్, సింగూర్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంస్థల ఎన్నికల్లో ఆమెకు ఎదురుదెబ్బ తగలడంతో.. బీజేపీ నేతలు బెంగాల్‌లోని కీలకమైన కోటలపై టీఎంసీ పట్టు కోల్పోతున్నట్లు అంచనా వేస్తున్నారు.