Bandi Sanjay: అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్‌కి రెడీ అంటుండు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు. ఎప్పుడో పీసీసీ అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్‌కి రెడీ అంటుండు అని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని ఆయన తెలిపారు.
నేను తంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా.. తాము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే.. తెలంగాణలో పేదోళ్ల పరిస్థితి దారుణం అవుతుందన్నారు. మీ భాష చూసి నవ్వుకున్నామన్నామని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారంటూ ఆరోపించారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసిందంటూ విమర్శించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చన్నారు. కేసీఆర్ అభివృద్ధి ఏమి చేసిండో ప్రకటించు అంటూ సవాల్ విసిరారు.
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే: మంగళవారం మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? పనికిమాలిన రాజకీయం వద్దు అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ని ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. డ్రగ్ టెస్ట్ చేయించాలని ఉబలాటపడుతున్న బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్ టెస్ట్ కోసం నా రక్తం.. కిడ్నీ కూడా ఇస్తా. ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకు రా… క్లీన్ చిట్ తో బయటికి వస్తా.. ఈ విషయంలో ఓడిపోతే.. బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటారా? అన్నారు కేటీఆర్. డ్రగ్ విమర్శలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా ఘాటైన సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటాడా..? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!