Site icon NTV Telugu

Bandi Sanjay: అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్‌కి రెడీ అంటుండు.. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు. ఎప్పుడో పీసీసీ అధ్యక్షుడు సవాల్‌ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్‌కి రెడీ అంటుండు అని బండి సంజయ్‌ అన్నారు. కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని ఆయన తెలిపారు.

నేను తంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా.. తాము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే.. తెలంగాణలో పేదోళ్ల పరిస్థితి దారుణం అవుతుందన్నారు. మీ భాష చూసి నవ్వుకున్నామన్నామని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారంటూ ఆరోపించారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసిందంటూ విమర్శించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చన్నారు. కేసీఆర్ అభివృద్ధి ఏమి చేసిండో ప్రకటించు అంటూ సవాల్ విసిరారు.

మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే: మంగళవారం మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? పనికిమాలిన రాజకీయం వద్దు అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ని ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. డ్రగ్ టెస్ట్ చేయించాలని ఉబలాటపడుతున్న బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్ టెస్ట్ కోసం నా రక్తం.. కిడ్నీ కూడా ఇస్తా. ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకు రా… క్లీన్ చిట్ తో బయటికి వస్తా.. ఈ విషయంలో ఓడిపోతే.. బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటారా? అన్నారు కేటీఆర్. డ్రగ్ విమ‌ర్శలపై ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా ఘాటైన సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బ‌య‌ట‌కు వ‌స్తా.. అప్పుడు క‌రీంన‌గ‌ర్ చౌర‌స్తాలో బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటాడా..? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Exit mobile version