Site icon NTV Telugu

JP Nadda: జేపీ నడ్డా విమానంలో సాంకేతిక లోపం.. కర్ణాటకకు వెళ్లి హైదరాబాద్‌కు రాక

Jp Nadda

Jp Nadda

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Bandi Sanjay: కరీంనగర్‌ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్

శంషాబాద్‌ విమానాశ్రయంలో జేపీ నడ్డాకు కాషాయ పార్టీ నేతలు స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రనేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇప్పటికే ఈ సభకు ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.

Exit mobile version