NTV Telugu Site icon

Satya Kumar: పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలపై ఫోకస్‌ చేశాం

Satya Kumar

Satya Kumar

Satya Kumar: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. అయితే, పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌.. దేశంలో సుపరిపాలన అందిస్తున్న మోడీ నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని, అది అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు పునాదిగా మారిందని సత్య కుమార్ అన్నారు. కేంద్ర అవినీతిలేని పాలన అందిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం అవినీతి పాలన సాగుతుందని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులతో ఇక్కడి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని పాలన సాగిస్తుందని, వాలంటీర్లు, పోలీసులు లేకుండా వైసీపీ నాయకులు బయటకు రాలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని సత్య కుమార్ ఎద్దేవా చేశారు.

Read Also: YS Sharmila: నేడు జగన్‌ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి

గుంటూరులో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్‌.. వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశ వ్యాప్తంగా జరుగుతుంది. వంద రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని వివరిస్తాం అని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేస్తున్నాం. సీఎం అసమర్థమతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతాం అన్నారు. పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. వాలంటీర్ లేకుండా పోలీసు లేకుండా బయటకు రాలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల మధ్యకు రాలేకపోతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు సత్యకుమార్‌ రాజు.