Site icon NTV Telugu

Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై బీజేపీ ఎంపీ ఫైర్..!

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశం ఏం అనుకుంటుందో మోడీకి తెలుసు. మోడీ నాయకత్వం ఎలా ఉంటుందో భారత ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

Read Also: MLA Vakiti Srihari: మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.. ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను మోడీ నేతృత్వంలో భారత్‌కు కలిపే ధైర్యం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే విషయం కాదు.. మోడీ ప్రభుత్వం పీఓకేను భారత్‌లో కలపడం కచ్చితంగా చేస్తుంది. పాకిస్తాన్ త్వరలో రెండు ముక్కలు అవుతుంది. బలూచిస్తాన్ ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. ఇక రాఫెల్‌పై అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఒక్క రాఫెల్‌ కూడా కూలలేదు. అవాస్తవాలు చెబితే చట్టపరమైన చర్యలు తప్పవు. కేసులు పెట్టి బొక్కలేస్తాం అని రఘునందన్ హెచ్చరించారు.

Read Also: Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..

భారత్ సైన్యం వెనుక మేము ఉన్నామని, వారికి మద్దతుగా నిలబడతామని చెప్పేందుకే తిరంగ ర్యాలీలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. రేవంత్, రాహుల్‌ లకు నిజంగా ధైర్యం ఉంటే ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహించి వెళ్లాలని చెప్పండి. అలా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అందుకు సైన్యంలో లేటరల్ ఎంట్రీ ఉంది. కానీ, నాయకులు దానికి అర్హతను చూపించాలి. రాజకీయ లబ్ధికోసం మాట్లాడడం మంచిది కాదని అన్నారు.

Exit mobile version