NTV Telugu Site icon

Raghunandan Rao: హైదరాబాద్‌ శివార్లలో డ్రగ్స్‌ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్‌ రావు

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్‌లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదారాబాద్ శివార్లలో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాం హౌస్‌లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగిందని వార్తలు వచ్చాయన్నారు. ఫామ్‌హౌస్‌లో సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది పెద్దలను పోలీసులు పంపించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిజాలు వెల్లడవుతాయన్నారు. ఈ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవహారంలో ఎంతటి వాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

Read Also: Raj Pakala: కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ!

 

Show comments