GVL Narasimha Rao: కేసీఆర్ తెలంగాణను రాజకీయాల కోసం వాడుకొని దగా చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో అవినీతి చేశారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపణలు చేశారు. మోడీ చెప్పిందే చేస్తారని.. బీసీ సీఎం నినాదంతో నిశ్శబ్ధ విప్లవం మొదలైందన్నారు. బీసీలు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మళ్ళీ వందేళ్లు అయిన అవకాశం రాదన్నారు. ఊహకు అందని ఫలితాలు వస్తాయన్నారు. దమ్ముంటే రేవంత్ బీసీ సీఎం ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. ముస్లింల కోసం ఐటీ పార్కా.. ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడ చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మాట ఏవైనా దేశాలు వింటే నవ్వుతారన్నారు. బీఆర్‌ఎస్ అవినీతిపై పూర్తి స్థాయి శిక్ష పడాలంటే బీజేపీని గెలిపించాలని జీవీఎల్ నరసంహరావు ప్రజలను కోరారు.
Also Read: Amit Shah: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే
ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఇక్కడే బీజం పడిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. లిక్కర్ స్కాంలో ముగ్గురిని అరెస్ట్ చేశారని.. కవిత, అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారన్నారు. అవినీతికి పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరన్నారు. కోడ్ వర్డ్స్ తో పెట్టుకొని చాటింగ్ చేశారని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తాను అనేక ప్రాంతాల్లో తిరిగానని.. ప్రజలంతా ఇదే చెప్తున్నారని.. లక్ష ఉద్యోగాలు ఎక్కడ అని యువత అడుగుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది అంటూ బీఆర్‌ఎస్ సర్కారును ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కేజీ టూ పీజీ ఫ్రీ అన్నారు .. మర్చిపోయారని.. 7లక్షల మందికి ఇల్లు ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఆలోచనలన్ని ఒకేలాగా ఉంటాయన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ.