NTV Telugu Site icon

GVL Narasimha Rao: కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరమే..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం అంటే ప్రజా సంక్షేమం కోసమే తప్ప అనవసర నిందలు వేయడం సరైనది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే లాభాపేక్ష ఆశించి చేస్తున్నారని నిందలు వేయడం దారుణమన్నారు.

Read Also: TTD Chairman: శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి శంకుస్థాపన చేసిన టీటీడీ ఛైర్మన్

స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత కంటే ఎక్కువ నిధులు వచ్చాయని ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవంను బాయ్ కట్ చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని.. నరేగా కింద దేశంలోనే అత్యధికంగా 55వేల కోట్లు తీసుకున్న రెండో రాష్ట్రం ఏపీ అంటూ జీవీఎల్‌ నరసింహారావు చెప్పుకొచ్చారు.