Site icon NTV Telugu

CM Ramesh: ఏపీలో ఎన్నికల పొత్తులు.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు.

Cm Ramesh

Cm Ramesh

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరగనుంది.. ముందుగా ఈ సమావేశానికి బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌ హాజరుకావాల్సి ఉండగా.. వేరే కార్యక్రమాలు ఉండడంతో ఏపీ పర్యటనను తరుణ్ చుగ్ రద్దు చేస్తున్నారు.. అయితే, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ సాగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌.. పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం అన్నారు. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేశారు.

Read Also: Hanuman Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి?

రాష్ట్ర స్థాయిలో పొత్తులపై చెప్పేదేం ఉండదు అన్నారు ఎంపీ సీఎం రమేష్‌.. పార్టీలో కొంత మంది నేతలు పొత్తులపై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారన్న ఆయన.. పొత్తులపై మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నేతలు వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, ఇవాళ్టి సమావేశాలో పొత్తులపై మాట్లాడే నేతలను కట్టడి చేయాలని కోరతాం అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమే అని ప్రకటించారు. కానీ, ఆ కూటమిలో ఎవరెవరు ఉండాలో జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌. కాగా, ఇవాళ్టి సమావేశాలకు ముఖ్యనేతలను మాత్రమే ఏపీ బీజేపీ ఆహ్వానించిన విషయం విదితమే..

Exit mobile version