Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss : నితిన్‌గడ్కరీ విసిరిన ఛాలెంజ్‌తో ఓ బీజేపీ ఎంపీ ఏకంగా 32కేజీలు తగ్గారు. దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ ఉజ్జెయినీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పాల్గొన్నారు. ‘మీరు బరువు తగ్గాలి. తగ్గిన ప్రతీ కేజీకి ఉజ్జెయినీఅభివృద్ధి కోసం రూ. 1000కోట్లు మంజూరు చేస్తాము,’ అని ఆ నియోజకవర్గం ఎంపీ అనిల్ఫిరోజియాతో అన్నారు. గడ్కరీ హామీతో 32 కిలోలు తగ్గిన ఉజ్జయినీ ఎంపీ అనిల్ఫిరోజియా. అధిక బరువును వదిలించుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని, అదే సమయంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఈ ఏడాది జూన్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ హామీ ఇచ్చారు. ఒక్క కిలో బరువు తగ్గితే నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఫిట్ ఇండియా’ పథకం ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి ఈ హామీ ఇచ్చారు. దీంతో ఎంపీ ఫిరోజియా కష్టపడి కసరత్తులు చేసి ఇప్పటి వరకు 32 కిలోలు తగ్గారు. గడ్కరీ ఇచ్చిన మాట ప్రకారం తన నియోజకవర్గానికి 32 వేల కోట్లు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
Read Also: Cuttack crime news : అప్పు చెల్లించలేదని.. బైక్‌కు కట్టి 3కి.మీ ఈడ్చుకెళ్లాడు
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని లాంచ్‌చేశారు. నేను తగ్గిన ప్రతీ కేజీకి.. ఉజ్జెయిన్ అభివృద్ధి కోసం రూ. 1000కోట్లు మంజూరు చేస్తామని స్టేజీ మీద నితిన్ గడ్కరీ అన్నారు. నేను ఆ ఛాలెంజ్ తీసుకుని 32కేజీలు తగ్గాను. ఇంకా తగ్గుతాను. నా నియోజకవర్గానికి నిధులు వస్తాయంటే.. ఇంకా తగ్గుతాను,” అని అనిల్ ఫిరోజియా తెలిపారు. ఉదయాన్నే 5:30 గంటలకు మేల్కొని మార్నింగ్ వాక్ కు వెళ్లడం, ప్రతిదినం యోగా చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా తన అధిక బరువును వదిలించుకున్నట్లు ఎంపీ ఫిరోజియా చెప్పారు. ఉదయం తేలిక పాటి టిఫిన్, మధ్యాహ్నం సలాడ్, కాయగూరలు, చపాతీలతో భోజనం చేశానని తెలిపారు. ఈ నియమాలతో గతంలో 127 కిలోల బరువున్న తాను ఇప్పుడు 95 కిలోలకు తగ్గానని ఫిరోజియా చెప్పారు. తాను బరువు తగ్గితే నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయంటే మరింత బరువును కోల్పోవడానికి సిద్ధమని ఫిరోజియా స్పష్టం చేశారు.
Read Also:Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్‌కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
ఇప్పుడు ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనిల్ ఫిరోజియా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఈ నెల 14న నితిన్ గడ్కరీని కలిశారు బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా. బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. సంతోషించిన నితిన్ గడ్కరీ.. ఉజ్జెయిన్ అభివృద్ధి కోసం రూ. 2,300కోట్లు విడుదల చేస్తానని హామీనిచ్చినట్టు తెలుస్తోంది.
- Tags
- Anil Firojiya
- bjp
- mp
- nitin gadkari
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..