NTV Telugu Site icon

BJP: తెలంగాణలో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు

Bjp

Bjp

తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు ఇప్పటికే నుంచే పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల దగ్గరకు వెళ్లడానికి రాజకీయ నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగర వేసేందుకు పావులు కదుపుతోంది. నియోజక వర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also: Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..

రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా బదులు చెప్పగల సరైన ప్రత్యామ్నయం తామే అని కమలం పార్టీ నేతలు చెప్పుతున్నారు. అయితే, ఈసారి ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలను కమలం పార్టీ అధిష్టానం రంగంలోకి దించుతుంది. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి పర్యటనలను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటన చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు తెలంగాణ గడ్డ మీద పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Switzerland: భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులు నిలిపివేత

అయితే, ఒక్కో ఎమ్మెల్యే తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలవనున్నారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టును తీసుకుని వాటిని బీజేపీ అధిష్ఠానానికి సమర్పిస్తారని తెలుస్తోంది. ఇక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల రాకతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగనుంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు తమదైన ప్రణాళికలు రచించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.