Adinarayana Reddy: వైసీపీ నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adinarayana Reddy: పులివెందులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోబోతుంది.. వైసీపీ నాయకులంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదినారాయణ రెడ్డిని శాలువాతో సత్కరించారు బీజేపీ రాష్ట్ర నేతలు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి 10 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కూటమికి బలాన్ని చేకూర్చిందన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరుతామని జమ్మలమడుగులో క్యూ కడుతున్నారని తెలిపారు.
Read Also: Gudivada Amarnath: రాజధానిపై అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
రాష్ట్రంలో కూటమి గెలుపునకి పవన్ కల్యాణ్ తోడ్పడ్డారని వెల్లడించారు ఆదినారాయణరెడ్డి.. రాష్ట్రంలో పుష్ప సినిమా రీతిలో స్మగ్లింగ్ చేశారు.. వైసీపీ అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారు.. రైల్వే జోన్ కి స్థలం ఇవ్వలేదు అని విమర్శించారు. వారం రోజుల్లోపే వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కి సిద్ధం అవుతున్నారు.. పులివెందులలో కూడా వైసీపీ నామరూపాలు లేకుండా పోబోతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులందరూ బీజేపీలోకి లైన్ కడుతున్నారన్నారు ఆదినారాయణరెడ్డి.. కాగా, వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు మరింత లోతుగా జరిగితే ఆ విషయం బయటకు వస్తుందని ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. హత్యకేసును సీబీఐ 90 శాతం ఛేదించిందన్న ఆయన మిగిలిన 10 శాతం పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!