NTV Telugu Site icon

Raghunandan Rao: పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా..?

Raghunandan

Raghunandan

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి… పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో కలిసి ఏమీ మాట్లాడారు.. ఈస్టర్న్ కన్స్ట్రక్షన్ ఎవరిది.. భూములను ఆక్రమించింది ఎంత.. సర్వే నంబర్ 343, 403 లో ఏమీ జరుగుతుందని ప్రశ్నించారు.

Heroine Accident: విజయ్ ఆంటోనీ హీరోయిన్‌కి రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కి కూడా డబ్బుల్లేక?

అడ్డగోలు కన్స్ట్రక్షన్ మీద ఈడీ, ఐటీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు అన్నారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది.. మీరు ఎందుకు పార్టీ మారారో ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. మీరు బీజేపీకి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత, ఆర్థిక లబ్ది కోసం మీరు పార్టీ మారారని పేర్కొన్నారు. పాలమూరులో మీరు మీ కొడుకు కోసం పని చేశారా… ఇప్పుడు అధికారంలోకి ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కన్స్ట్రక్షన్ కంపెనీల నుండి డబ్బులు వందల కోట్లు చేతులు మారాయి.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ డబ్బులు పంపబోతున్నారని రఘునందన్ రావు తెలిపారు.

MLA Rammohan Reddy: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..

ఇదిలా ఉంటే.. శుక్రవారం జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన తన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన చేతులు కలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన రెండు పదవులు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.