Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలు ఎస్ఐఆర్ (Special Intensive Revision) పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా నవంబర్ 2న హైదరాబాద్‌లో ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ సమగ్రతను, శాంతిభద్రతలను కాపాడే చట్టాలపై రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్న కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించింది. “ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం! అరాచకవాదాన్ని అంతం చేద్దాం!!” అనే నినాదంతో సోమవారం సాయంత్రం 4:00 గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పాదయాత్ర సాగనుంది.
ఇక, ఈ మహా పాదయాత్రకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, బీజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ తమిళనాడు కో-ఇంచార్జ్ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక కో-ఇంచార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖ నాయకులు పాల్గొననున్నారు. దేశ ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ అరాచక శక్తులకు వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్, ఇండీ కూటమి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని బీజేపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశ వ్యతిరేక శక్తుల ఆట కట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జాతీయవాదులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
Also Read
- Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
- లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
- Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
- Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!