Site icon NTV Telugu

BJP New President: నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!

Bjp

Bjp

త్వరలోనే బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించనుంది. పరిశీలనలో ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి తదితర నేతల పేర్లు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఓ పదిరోజుల్లో, మొత్తంగా ఈ నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తికానుంది. అలాగే, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు 14 రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తైంది. మరో 18 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు నియామక ప్రతిపాదనలు సిద్ధం ఉన్నాయి.

READ MORE: Akhil Akkineni Wedding: అక్కినేని వారి పెళ్లి చిత్రాలు చూసేద్దామా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగాలంటే, కనీసం మరో 6 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికలు, రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల బీజేపీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయనుంది. ఈనెల 10 లోగా కొన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పై ఏకాభిప్రాయం కోసం.. ఆర్‌ఎస్ఎస్, బీజేపీ ముఖ్య నేతల మధ్య సంప్రదింపులు జరగనుంది.

READ MORE: Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!

Exit mobile version