మోడీ పై పోస్టర్ లు, కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ స్పందించింది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ ర్యాలీ, ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సుమారు 680 కోట్ల రూపాయలతో 5ఏళ్ల కింద పనులు ప్రారంభించిందని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆసమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ముందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరు నెలలోగా జాతీయ రహదారి కి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు, పైపు లైన్ తొలగించడంతో పాటు భూ సేకరణ చేసి అప్పగిస్తామని చెప్పి నేటి వరకు అప్పగించలేదని ఆరోపణ చేశారు.
Also Read : Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..
వంతెన నిర్మాణంపై ప్రధాని మోదీని తప్పు పట్టడం సరికాదని, నెల రోజులలోగా భూ సేకరణ చేసి, స్తంభాలు తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మంత్రి కేటీఆర్ ను ఉప్పల్ లో అడుగు పెట్టనియమని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన వంతెన నిర్మాణం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
Also Read : OBC Classification Time Extension: ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు
