Temple Clean: వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో గో మూత్రంతో ఆలయాల శుద్ధి చేసిన బీజేపీ నేతలు..

  • విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసారు బీజేపీ నేతలు.
  • 'గోవు ఘోష విను గోవిందా' పేరుతో
  • గో మూత్రంతో ఆలయాలు శుద్ధి.
Bjp

Bjp

Temple Clean: విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసారు బీజేపీ నేతలు. ‘గోవు ఘోష విను గోవిందా’ పేరుతో గో మూత్రంతో ఆలయాలు శుద్ధి చేసారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మలు శుద్ధి చేసారు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. లడ్డూ తయారిలో నెయ్యి కల్తీ అనేది స్పష్టం. నేలకు ముక్కు రాసి జగన్, ఆనాటి టిటిడి చైర్మన్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్ బౌలర్స్ వీరే.!

తప్పు చేసి కూడా ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు.. మళ్లీ ఆలయాల్లో కార్యక్రమాలు పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటని., వాళ్లు రాజకీయం కోసం ఆలయాలను కూడా అపవిత్రం చేశారని, మేము అదే ఆలయాల్లో శుద్ది కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇప్పుడు అయినా చేసిన తప్పుకు వారంతా స్వామి వారికి క్షమాపణ లు‌ చెప్పాలని, కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్రధారులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.

TG Venkatesh: హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు..